News

సేవా భారతి ఆధ్వర్యంలో వినాయకుడి మట్టి విగ్రహాల పంపిణీ

619views

విజయవాడ: హిందువుల పండగ వినాయక చవితిని పుస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ సేవాభారతి ప్రతినిధులు పట్టణంలోని శాతవాహన కళాశాల దగ్గర గురువారం వినాయకుడి మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రకృతి కూడా భగవంతుడితో సమానమని, ఈ దృష్ట్యా పర్యావరణానికి పూజలు మేలు చేయాలి కాని హాని కలుగకూడదని ప్రతినిధులు భక్తులకు చెబుతూ విగ్రహాలను అందజేశారు. మొత్తం 300 మట్టి విగ్రహాలతో వినాయక వత్రకల్పం పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అలాగే కృష్ణలంకలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆబాలగోపాలం అంతా తమ చేతుల మీదుగా మట్టి విగ్రహాలను తయారు చేసి, స్థానికులకు పంపిణీ చేశారు. గాంధీనగర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో 300 మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి