News

జిహాద్‌ కోసం కేరళలో ఉగ్ర ముఠా ప్లాన్‌!

781views
  • దేశంలో విధ్వంసానికి పక్కా ప్రణాళిక

  • 3,200 స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌

  • ఇందులో మహిళలు 40% మంది

  • ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ నివేదిక వెల్ల‌డి

తిరువనంతపురం: కరుడుగట్టిన ఉగ్రవాదులకు పుట్టినిల్లు అయిన కేరళలో ఐసిస్‌ ఉగ్రవాదులు యాక్టివ్‌ అయ్యారు. అక్కడి గల అల్‌-కేరళ మిలిటరీ బ్రిగేడ్‌ అనే ఉగ్ర సంస్థ జిహాద్‌ కోసం పక్కా ప్రణాళిక రచించింది. వివిధ చోట్ల విధ్వంసం సృష్టించడానికి ఏకంగా 3,200 స్లీపర్‌ సెల్స్‌ను సిద్ధం చేసుకుంది. ఇందులో 40 శాతం మంది మహిళలను చేర్పించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

భీతి కలిగించే ఈ సమాచారాన్ని ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ తన కొత్త నివేదికలో వెల్లడిరచిందని జన్మభూమి దినపత్రిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం… ప్రతి స్లీపర్‌ సెల్‌లో 10 మంది సభ్యులు ఉంటారు. ఇలా మొత్తం 32,000 స్లీపర్‌ సెల్‌ సభ్యులు ఉన్నారు. వీరిలో 40% మంది మహిళలు ఉండగా, ఎక్కువ మంది ముస్లింలుగా మారిపోయారు. వారంతా కేరళలో చివరి జిహాద్‌ కోసం సిద్ధమవుతున్నారు.

స్లీపర్‌ సెల్‌ సభ్యులు సోషల్‌ మీడియాలో చర్చను తారుమారు చేయడానికి, జిహాద్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి, తీవ్రవాదం వైపు ప్రజలను ఆకర్షించేలా తయారు చేయడానికి, ఆయుధాలను ఉపయోగించడానికి కూడా శిక్షణ పొందారు. వారిలో కొందరు బాంబు తయారీలో నిపుణులు. సినిమా తదితర అన్ని ప్రధాన రంగాల్లో స్లీపర్‌ సెల్‌ ఉన్నట్టు నివేదిక హెచ్చరిస్తోంది.

స్లీపర్‌ సెల్స్‌ సభ్యులు భారతదేశం వెలుపల నుంచి అధిక మొత్తంలో వచ్చిపడే డబ్బుకు, సెక్స్‌కు, ఉద్యోగాలకు లొంగిపోయారని యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా తెలిపింది. కేరళ నుంచి ఐఎస్‌ఐఎస్‌లో చేరడం కోసం ఇరాక్‌, సిరియా వెళ్లే దేశ వ్యతిరేక సంస్థలు, వ్యక్తుల వల్ల ఇప్పటికే ఆ రాష్ట్రం అప్రతిష్ఠ మూటకట్టుకున్న విషయం విదితమే.

 

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి