News

పారా ఒలింపిక్స్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం.. కేంద్ర క్రీడల శాఖ మంత్రిని కలిసిన క్రీడాకారులు

803views

టోక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్లకు దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పతకాలు సాధించిన నలుగురు క్రీడాకారులను చూసేందుకు ఎయిర్​పోర్ట్​ వద్దకు పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా జావెలిన్​ త్రోలో స్వర్ణ పతకం సాధించిన సుమిత్​ అంటిల్​ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. దిల్లీ చేరుకున్న వారిలో సుమిత్​తో పాటు రజత పతక విజేతలు దేవేంద్ర ఝజారియా, యోగేశ్​ కథునియా(డిస్కస్​ త్రో).. కాంస్య పతక విజేత శరద్​ కుమార్​(హైజంప్​) ఉన్నారు.

భారత్​లో క్రికెట్​ బ్యాట్​కు పోటీగా జావెలిన్​ త్రో ఈటెకు పాపులారిటీ పెరుగుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ అన్నారు. పారాలింపిక్స్​లో పతకాలు సాధించి.. స్వదేశానికి చేరుకున్న అథ్లెట్లతో శుక్రవారం ఆయన మాట్లాడారు. అనంతరం గోల్డ్​ మెడలిస్ట్​ సుమిత్​తో పాటు రజత పతక విజేతలు దేవేంద్ర ఝజారియా(జావెలిన్​ త్రో), యోగేశ్​ కథునియా కాంస్య పతక విజేత శరద్​ కుమార్​ లను అనురాగ్​ సత్కరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి