
మొన్నటి ఎన్నికల ముందు, తర్వాత మమతా బెనర్జీ అండ చూసుకుని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ ) కార్యకర్తల ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. అయితే, వారి వికృత చేష్టలు ఇంకా ఆగడం లేదు. దీనిపైనే కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ఆ పార్టీ వైఖరిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. టీఎంసీ… కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దోచుకుంటుందని ఆరోపించారు.
బెంగాల్ రాష్ట్ర ఎన్నికల తర్వాత టిఎంసి చేసిన పెద్ద ఎత్తున దారుణాలను ఎత్తి చూపిన అధిర్ రంజన్ చౌదరి గురువారం ముర్షిదాబాద్‌లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల అకృత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 2 న పట్టపగలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెందిన ఇళ్లను టిఎంసి కార్మికులు “ధ్వంసం చేసి, దోచుకున్నారు” అని చౌదరి ఆ లేఖలో పేర్కొన్నారు.
పట్టపగలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై మీ కార్యకర్తలు దాడి పాల్పడుతున్నారు, మా కార్యకర్తలకు చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు… ఈ విషయాలు మీ దృష్టికి తెస్తున్నానని ఆ లేఖలో వివరించారు. పోలీసుల ఉన్నా తమ పార్టీ కార్యకర్తలకు రక్షణ కరవైందని, ఈ దుర్మార్గులపై తక్షణమే చర్యలు తీసుకోవడం అత్యవసరం అని చౌదరి ఆ లేఖ మమతాను అభ్యర్థించారు.
SOURCE : Organiser
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





