News

జలియన్ వాలాబాగ్ స్మారకాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

674views

మృత్ ‌సర్‌లో పునర్నిర్మించిన జలియన్ ‌వాలాబాగ్‌ స్మారక భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వర్చువల్‌ విధానంలో జాతికి అంకితం చేశారు. 1919 ఏప్రిల్‌ 13న బ్రిటిష్‌ సైనికుల దుశ్చర్యకు బలైన అమరులకు ఘన నివాళులర్పించారు. స్వాతంత్య్రం కోసం మన పూర్వీకులు చేసిన త్యాగాలను, పోరాటాలను గుర్తు చేస్తూ రాబోయే తరాలకు కూడా ఈ ప్రాంతం స్ఫూర్తిని రగిలిస్తుందని ప్రధాని తెలిపారు. ఆత్మవిశ్వాసాన్ని, స్వయంసమృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకతను ప్రపంచ పరిణామాలు మనకు గుర్తు చేస్తున్నాయన్నారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఇబ్బందుల్లో చిక్కుకున్నా భారతీయులం వారికి అండగా నిలుస్తున్నామంటూ కరోనా, అఫ్గానిస్థాన్‌ సంక్షోభాలను ప్రస్తావించారు. ఆపరేషన్‌ దేవిశక్తి ద్వారా వందల మందిని కాబుల్‌ నుంచి తరలించినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.