News

అమెరికాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు… మృతదేహాల తరలింపు, అంత్యక్రియలకు ఇబ్బందులు

577views

అమెరికాలో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో శుక్రవారం 1.90 లక్షలకు పైగా కేసులు రాగా.. 1,300 మంది మృతి చెందారు. ఫ్లోరిడాలో నెల రోజుల క్రితం రోజువారీ మరణాల సగటు 52 కాగా.. వారం రోజులుగా రోజుకు 279 సంభవిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల నుంచి మృతదేహాల తరలింపు.. అంత్యక్రియల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫ్లోరిడాలో శుక్రవారం 27 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. కొందరు పిల్లలు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. 211 మంది పిల్లలు కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.