
724views
భారతీయ తీరగస్తీ నౌక ‘ఐసీజీ విగ్రహ’ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖలోని ఇండియన్ కోస్ట్‌గార్డ్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. కోస్టుగార్డు వెసల్స్ ఆర్డర్లలో ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఏడో నౌకను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా చెన్నైలో జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నాయి. పూర్తి ఆధునిక పరిజ్ఞానంతో రెండు ఇంజిన్ల హెలికాప్టర్లు, నాలుగు స్పీడ్ బోట్లు ఉండే విగ్రహ నౌక 26 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.





