News

భారత్ అధ్యక్షతన భద్రత మండలిలో రెండు శాంతి పత్రాల ఏకగ్రీవ ఆమోదం

674views

క్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం శాంతి భద్రతల సమస్యపై.. మొదటిసారి రెండు కీలక పత్రాలను భారత్ నాయకత్వంలో ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ అధ్యక్షతన ‘ప్రొటెక్టర్స్ ది ప్రొటెక్టర్స్’ అనే థీమ్‌తో బహిరంగ చర్చను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలపై దాడులు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు మొదటి పత్రాన్ని భద్రతా మండలి.. ఏకగ్రీవంగా ఆమోదించింది. శాంతిపరిరక్షణ దళాలకు సాయంగా సాంకేతికతను వినియోగించాలనే పత్రాన్ని కూడా ఆమోదించింది.

భారత్‌ నేతృత్వంలో తయారైన ఈ దస్త్రాలను భద్రతా మండలిలోని 15 దేశాలతో పాటు 80కిపైగా ఐరాస సభ్యదేశాలు మద్దతు తెలిపాయి. శాంతిపరిరక్షణలో సాంకేతికత ఉపయోగించే భాగస్వామ్యంపై అంతకుముందు… ఐక్యరాజ్యసమితి, భారత్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు.. శాంతిపరిరక్షక దళాల విధుల చిత్రీకరణ, పర్యవేక్షణ, సమన్వయం కోసం యునైట్ ఎవేర్ అనే వేదికను భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కోసం భారతదేశం 1.64 మిలియన్ డాలర్లు అందించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.