News

కొత్తరకం మొక్కను కనుగొన్న భారతీయ శాస్త్రవేత్తలు

763views

భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం మొక్కను కనుగొన్నారు. అండమాన్‌ దీవుల్లో ఉన్న అర్చిపెలాగో దీవిలో కనుగొన్న ఆ మొక్కకు వృక్ష శాస్త్రజ్ఞులు ‘జలకన్య’ అనే పేరు పెట్టారు. ఆంగ్లంలో మెరమైడ్‌. అయితే ఈ మొక్కను కనుగొని రెండేళ్లయినా అది కొత్త రకం మొక్క అని చెప్పడానికి ఇన్నాళ్లు పట్టిందట..

2019లో అర్చిపెలాగో దీవిలో వృక్ష శాస్త్రవేత్తలు పర్యటించారు. ఆ సమయంలో ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని గుర్తించారు. నాలుగు దశాబ్దాల్లో ఇది మొదటిగా పంజాబ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. 18 నెలల పాటు ఆ మొక్కపై పరిశోధనలు చేశారు. ఆ మొక్క డీఎన్‌ఏను అధ్యయనం చేసి ఆల్గె జాతికి చెందిన మొక్కగా నిర్ధారించారు. మొక్కకు మెరమైడ్‌ అని నామకరణం చేసిన శాస్త్రజ్ఞులు మొక్కకు శాస్త్రీయ నామం ‘అసిటబులేరియా’ అని పెట్టారు. జలకన్య అంటే సముద్ర దేవత అని అర్థం. ఈ కొత్త మొక్క అందంగా ఉంది. ఆకు తక్కువ మందంలో ఉండి సున్నితంగా ఉంది. దీంతో గొడుగుల మాదిరి ఆకులు ఉండడం విశేషం. ఆ గొడుగుల్లోనే జలకన్య కనిపిస్తోందని.. అందుకే ఆ పేరు పెట్టినట్లు పంజాబ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఫెక్లీ బస్త్‌ వివరించారు. ఈ మొక్క ఒకే బక్క భారీ కణంతో తయారైనట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.