News

తిరుమలలో సంప్రదాయ భోజనం… త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త కార్యక్రమం..

825views

తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ‘సంప్రదాయ భోజనం’ పేరుతో అందుబాటు ధరలో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం తిరుమల, తిరుపతిలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో వారు వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరో 15 నుంచి 30 రోజుల్లో గో ఆధారిత సాగు ద్వారా పండించిన సరకులతో తయారుచేసే ‘సంప్రదాయ భోజనం’ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

తితిదే ఆలయాల్లో వినియోగించే పుష్పాలతో తయారు చేసిన పరిమళభరితమైన అగరబత్తీలను సెప్టెంబరు మొదటి వారంలో తిరుమలలో తొలుత విక్రయిస్తామని పేర్కొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.