
768views
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్ళు నకిలీ టికెట్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని టీటీడీ పరిమిత సంఖ్యలోనే 300రూపాయల దర్శనం టిక్కెట్ల కోటాను రిలీజ్ చేస్తోంది. కాని శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా పోటీ పడుతుండటంతో…300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు నకిలీవి తయారుచేసి అమాయక భక్తులకు అమ్మున్నారు. వీటిని 15 రెట్లు అధికంగా అంటే రూ.4,400 విక్రయిస్తున్నారు. రోజూ టీటీడీ కేటాయించిన రూ.300 దర్శన టికెట్ల కంటే ఎక్కువమంది స్వామివారిని దర్శించుకుంటున్నట్లుగఅధికారుల దృష్టికి రావడంతో ఈ గుట్టు బయటపడింది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నకిలీ టికెట్లపై విచారణ చేస్తున్నారు. తిరుపతిలోని ట్రావెల్స్ నిర్వాహకుల పనిగా అనుమానిస్తురు.





