News

ఇంగ్లాండ్లో కాల్పుల కలకలం… ఆరుగురు మృతి..

716views

ఇంగ్లాండ్‌లోని నైరుతి ప్రాంతంలోని ప్లైమౌత్‌ పట్టణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించినట్లు కార్న్‌వాల్‌ పోలీసులు వెల్లడించారు. మరణించిన వారిలో పదేళ్ల లోపు చిన్నారి ఉన్నట్లు.. పలువురు గాయాలతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు.

గురువారం సాయంత్రం 6.10 గంటల ప్రాంతంలో కీహామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు.. కాల్పులకు తెగబడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఇది ఉగ్రవాద చర్యా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, యూకేలో గత 11 ఏండ్లలో సామూహిక కాల్పులు జరగడం ఇదే మొదటిసారి.. ఈ ఘటనతో పట్టణంలో భయాందోళన నెలకొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.