News

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోడీ

718views

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 9వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది.‎ ‎”9.75 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాల ఖాతాలో రేపు ₹19,500 కోట్ల నగదును జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో ప్రధాన మంత్రి సంభాషించనున్నారు” అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి ₹6,000లను కేంద్రం ప్రతి ఏడాది మూడు విడుతలలో విడుదల చేస్తుంది. ఒక్కొక్క విడుతలలో భాగంగా ₹2,000లను ప్రతి నెలలకు ఒకసారి జమచేస్తుంది. ‎ఈ నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో బదిలీ చేస్తారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ₹1.38 లక్షల కోట్లకు పైగా రైతు కుటుంబాలకు బదిలీ చేశారు.‎ ‎ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొంటారు.‎ ‎అంతకు ముందు మే 14న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 8వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.