
906views
పూరీలోని జగన్నాథ్ ఆలయం తెరుచుకోనుంది. ఆగస్టు 16 నుంచి 20 వరకు స్థానికులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. శని, ఆది వారాల్లో లాక్‌డౌన్ ఉండడంతో బయటి వారికి ప్రవేశం లేదని పేర్కొన్నారు. పూరీలో ఆగస్టు 20 వరకు వీకెండ్ లాక్ డౌన్ ముగిసిన తరువాత భక్తులందరికి ఆగష్టు 23 నుంచి ప్రవేశం కల్పించనున్నారు. అయితే ఆలయంలోకి ప్రవేశించాలంటే మాత్రం RT-PCR పరీక్ష లేదా టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా గతేడాది పూరీ రథయాత్రకు భక్తులను అనుమతించలేదు. ఈ ఏడాది కూడా కోవిడ్ వ్యాప్తిలో ఉన్నందున గత నెలలో జగన్నాథుని రథయాత్ర పూరీకే పరిమితం చేసిన ప్రభుత్వం భక్తులు లేకుండానే చేపట్టింది.





