
566views
ఫిరోజ్‌పూర్ జిల్లాలో పాకిస్తాన్ నుండి భారత్ లోకి చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దర్ని భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జూలై 30 న భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు చొరబాటుదారులను BSF దళాలు హతమార్చినట్లుగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) పంజాబ్ శాఖ నిర్ధారించింది.
30 జూలై రాత్రి 8.48 గంటలకు, ఫిరోజ్‌పూర్‌లోని థెఖేలాన్ (అమర్‌కోట్) లో మోహరించిన BSF దళాలు భారత భూభాగంలోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్నవారిని వారి అనుమానాస్పద కదలికలను బట్టి పసిగట్టారు. దళాలు వారిని ఆగమని కోరినప్పటికీ, వారు దళాల హెచ్చరికలను పట్టించుకోకుండా సరిహద్దు కంచెని దాటే ప్రయత్నం చేశారు. దాంతో సరిహద్దు భద్రతా దళ సైనికులు వారిపై కాల్పులు జరిపి వారిని అంతమొందించారు.
Source : Organiser.





