
కాశ్మీర్‌లో భద్రతా బలగాల ధాటికి జైషే మహ్మద్ ఉగ్రవాది అద్నాన్ అలియాస్ ఇస్మాయిల్ అలియాస్ లంబూ ఈరోజు (జూలై 31) ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. హతమైన మరో ఉగ్రవాది ఎవరనేది తనిఖీ చేస్తున్నారు.
ఇంటెలిజెన్స్ అందించిన ఖచ్చితమైన సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు మొదలుబెట్టారు.
పుల్వామా దాడి సూత్రధారులైన ఉమర్ ఫరూక్ మరియు సమీర్ అహ్మద్ దార్ అలియాస్ హంజిలా వంటి జిహాదీలతో మృతుడు ఇస్మాయిల్ కు సన్నిహిత సంబంధం ఉంది.


ఫిబ్రవరి 14, 2019 న, పుల్వామా జిల్లాలో భద్రతా దళాల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. నలభై మంది వీర సైనికులు వీరమరణం పొందారు.
జైషే మహ్మద్ సంస్థ వర్గాల్లో ఇస్మాయిల్ ను సైఫుల్లా అనే పేరుతో పిలిచేవారు. ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహ్మద్ ఎంపిక చేసిన కమాండర్లలో అలాంటి పిలుపందుకోవడం చాలా గౌరవనీయమైనదిగా పరిగణించబడుతుంది.





