News

రోహింగ్యాల‌ను అక్ర‌మంగా భార‌త్ ‌కు త‌ర‌లిస్తున్న ముఠాను అరెస్టు చేసిన యూపీ పోలీసులు

707views

బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ ల‌కు చెందిన రోహింగ్యాలను అక్ర‌మంగా భార‌త్ ‌కు త‌ర‌లిస్తున్న ముగ్గురు సభ్యుల‌ ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. వీరు బంగ్లాదేశీ రోహింగ్యాల‌ను భార‌త్ కు తీసుకువ‌చ్చి చ‌ట్ట‌విరుద్ధంగా దేశంలో స్థిర‌ప‌రుస్తున్నారు. అందు కోసం వీరికి అక్రమ మార్గాలలో నిధులు కూడా అన్డుతున్నట్లు సమాచారం.

సమాచారం మేరకు నూర్ మొహమ్మద్, రెహ్మత్ ఉల్లా, షబీవుల్లా అనే ముగ్గురు స‌భ్యుల ముఠా బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ ల‌కు చెందిన‌ మహిళల‌ను, పిల్లలను ఘజియాబాద్, నోయిడా, ఢిల్లీ వంటి నగరాల్లో స్థిరపరచడానికి అక్ర‌మ మాన‌వ ర‌వాణా కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్నారు.

బంగ్లాదేశ్, మయన్మార్ పౌరులకు చట్టవిరుద్ధంగా వ‌స‌తులు ఏర్పాటు చేయ‌డానికి ఒక అంత‌ర్జాతీయ ముఠా కుట్ర‌లు చేస్తోంద‌ని యుపి ఎటిఎస్ కొంతకాలంగా సమాచారం పొందుతోంది. ఆ మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ ఇటీవ‌ల విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

ఈ సంద‌ర్భంగా యూపీ డీజీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ “ఎటిఎస్ చేప‌ట్టిన త‌నిఖిలో భాగంగా ముఠా నాయకుడు నూర్ ముహమ్మద్ అలియాస్ నూర్ ఇస్లాం బ్ర‌హ్మ‌పుత్ర ఎక్స్‌ప్రెస్ ద్వారా కొంతమంది రోహింగ్యాల‌ను బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్తున్న‌ట్టు గుర్తించిన‌ట్టు తెలిపారు. ఎటిఎస్ బృందం ఘజియాబాద్ స్టేషన్ వద్ద ఐదుగురిని ప‌ట్టుకుని విచారించగా పెళ్లి, ఉద్యోగం అనే నెపంతో వారిని అక్రమంగా ఢిల్లీకి తీసుకువ‌స్తున్న‌ట్టు తేలింద‌ని, దీనికి వారికి పెద్ద మొత్తంలో నిధులు కూడా అందిన‌ట్టు తెలిసిందని తెలిపారు.

బంగ్లాదేశ్ నుంచి వ‌స్తున్న అక్ర‌మ వ‌స‌ల‌దారుల‌ను క‌ల‌వ‌డానికి ఢిల్లీ స్టేషన్ వద్ద మ‌మ్మ‌ద్ అనుచ‌రుడు ఒక‌డు వేచి ఉన్నాడ‌ని, మొదట అతన్ని అదుపులోకి తీసుకున్నామ‌ని ఆ అధికారి తెలిపారు. 16, 18 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలను కూడా రక్షించామ‌ని, ఇద్దరూ మయన్మార్ ‌కు చెందినవారని పోలీసు అధికారి తెలిపారు.

అక్రమ రవాణాకు గురైన మరో వ్యక్తిని కూడా పోలీసులు రక్షించారు. ముగ్గురు నిందితులూ అక్రమ వలసదారులే. నూర్ ఇస్లాం బంగ్లాదేశ్ కు చెందినవాడు. ప్రస్తుతం త్రిపురలో నివసిస్తున్నాడు. రెహమతుల్లా మయన్మార్ నుండి వచ్చినవాడు, అతను రోహింగ్యాల కోసం జమ్మూ కాశ్మీర్ శరణార్థి శిబిరంలో ఉంటున్నాడు. మూడవ నిందితుడు- షబీల్లా కూడా మయన్మార్ ‌కు చెందినవాడు. ఈ ముగ్గురిపై ఐపిసి సెక్షన్లు 420, 467, 468, 471, 370, 120 బి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Source : OPINDIA & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.