News

ఆరుగురు జిహాదీలను దోషులుగా తేల్చిన గౌహతి ఎన్ఐఏ కోర్టు

489views

2019 లో అస్సాంలోని బార్‌పేట జిల్లాలో అరెస్టయిన బంగ్లాదేశ్ ‌కు చెందిన ఇస్లామిక్ టెర్రర్ సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను మంగళవారం గౌహతిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది.

దోషులుగా తేలిన ఉగ్రవాదులు హఫీజుర్ రెహ్మాన్, యాకుబ్ అలీ, షరీఫుల్ ఇస్లాం, ముస్తఫూర్ రెహ్మాన్, హఫీజ్ షఫీకుర్ ఇస్లాం మరియు బార్పేటకు చెందిన అజారుద్దీన్ అహ్మద్ లు. దోషులు అందరూ JMB అస్సాం విభాగం‌తో సంబంధం కలిగి ఉన్నవారే.

జనవరి 2020 లో వారిపై చార్జిషీట్ దాఖలు చేశారు. వారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎన్‌ఐఏ చార్జిషీట్ ‌లో పేర్కొన్నారు.

వారి అరెస్టు సమయంలో, వారి నుండి జిహాదీ సాహిత్యంతో పాటు ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. అస్సాం మరియు ఈశాన్య ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించడానికి ఈ జిహాదీలు ప్లాన్ చేశారు. దోషులుగా తేలిన ఆరుగురు ఉగ్రవాదులు జమాత్-ఉల్-ముజాహిదీన్ (‌JMB) సభ్యులు. JMB ఇటు భారతదేశంలోనూ, అటు బంగ్లాదేశ్‌లోనూ నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ.

గౌహతిలోని ప్రత్యేక NIA కోర్టు అక్రమ ఆయుధాల చట్టం ప్రకారం, JMB అస్సాం కమాండర్ హఫీజుర్ రెహ్మాన్ ‌కు 2 సంవత్సరాలా ఐదు నెలల జైలు శిక్ష మరియు రూ. 1000 జరిమానా విధించింది. మరో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

ఆధారాల ప్రకారం, శిక్షణ పొందిన ఈ ఆరుగురికి జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) జిహాదీ షహనూర్ ఆలం‌తో సంబంధాలు ఉన్నాయి. అస్సాంలో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి షహనూర్ వారిని నియమించుకున్నాడు. పశ్చిమ బెంగాల్ లోని బర్ద్వాన్ లో జరిగిన పేలుడు కేసుకు సంబంధించి 2014 అక్టోబర్ 10 న షహనూర్ ను NIA గతంలో అరెస్టు చేసింది.

మరింత లోతైన విచారణ కోసం అతన్ని అస్సాంలోని బార్పేట జిల్లాలోని తన స్వగ్రామానికి తీసుకెళ్లారు. షహనూర్ ఆలం లొంగిపోవడంతో దర్యాప్తు సంస్థకు JMB అస్సాంకు చెందిన వివరాలు తెలిశాయి. షహనూర్ నుండి వచ్చిన సమాచారంతో, ఎన్ఐఏ అస్సాంలో ఒక లోతైన దర్యాప్తు జరిపింది. అస్సాం JMB విభాగాన్ని పూర్తిగా ఛేదించింది. అందులో భాగంగానే ఉగ్రవాద సంస్థ యొక్క శిక్షణ పొందిన 6 మంది సభ్యులనూ NIA అరెస్టు చేసింది.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.