
475views
తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 9 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మహబూబ్‌నగర్,వరంగల్,జనగామ,యాదాద్రి,మేడ్చల్ జిల్లాల్లోని పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సందర్బంగా భారీగా పేలుడు పదార్థాలతో పాటు తయారీకి సంబంధించి పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ముత్తు నాగరాజు, వి.సతీష్, మేడ్చల్ లోని కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రి జిల్లాలో గుంజి విక్రమ్, త్రినాథరావు, జనగామలో సూర సారయ్య, వరంగల్‌లో వేలుపుస్వామి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నిందితుల నుంచి పలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మావోయిస్టు నేత హిడ్మాకు రవాణా చేయడానికి ప్లాన్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు.





