News

ఏపీ లో బక్రీద్ పై ఆంక్షలు.. ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిషేధం.. మసీదుల్లో కి 50 శాతం మందే అనుమతి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

587views

కోవిడ్ నియంత్రణ దృష్ట్యా.. బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ ప్రార్ధనలు నిషేధిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటించింది. భారీ జన సమూహాలను నివారించేందుకు.. మసీదుల్లో మాత్రమే ప్రార్ధనలకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. భౌతిక దూరం పాటిస్తూ.. మసీదుల్లో 50 శాతం మందికి మాత్రమే ప్రార్ధనలకు అనుమతిస్తున్నట్టు స్పష్టం చేసింది. మాస్కులు లేకుండా.. మసీదుల్లోకి ఎవరినీ అనుమతించవద్దని కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మసీదు ప్రాంగణాల్లో శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాల్సిందిగా కమిటీలకు సూచనలు చేసింది.

మాంసం విక్రయ కేంద్రాల్లోనూ కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని.. జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాంసం విక్రయ కేంద్రాల నుంచి వచ్చే వ్యర్ధాలను.. నదులు, వాగులు, చెరువుల్లో కలపకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.