News

తాలిబన్లతో చేతులు కలిపిన పాకిస్థాన్… ఆఫ్ఘన్ ప్రభుత్వానికి బెదిరింపులు… స్థానిక ప్రభుత్వ వైమానిక దాడుల అడ్డగింత

395views

ఫ్గనిస్థాన్‌ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశ సైన్యం, తాలిబన్ల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఈ క్రమంలోనే.. పాకిస్థాన్‌ వక్రబుద్ధి బయటపడింది. ఉగ్రమూకల పక్షాన చేరి వారికి అండగా నిలుస్తోంది. తాలిబన్లపై అఫ్గాన్‌ సైన్యం వైమానిక దాడులు చేయకుండా పాకిస్థాన్‌ మిలిటరీ అడ్డుకుంది. దక్షిణ కాందహార్‌లోని కీలక మార్కెట్‌ ప్రాంతమైన స్పిన్‌ బోల్డాక్‌ నుంచి తాలిబన్లను తరిమికొట్టే ప్రయత్నాలను అడ్డుకుంది. తాలిబన్లపై వైమానిక దాడులు చేస్తే తమ సైన్యం ఎదురుదాడి చేస్తుందని పాకిస్థాన్‌ వాయుసేన హెచ్చరిక జారీచేసినట్లు అఫ్గాస్థాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలెహ్ ట్వీట్‌ చేశారు. పాకిస్థాన్‌ సైన్యం కొన్నిప్రాంతాల్లో తాలిబన్లకు వైమానిక సాయం అందిస్తున్నట్లు ఆరోపించారు.అఫ్గాన్‌ సేనల దాడిలో గాయపడిన తాలిబన్లకు పాకిస్థాన్‌ వైద్య సాయం అందిస్తోంది. అఫ్గాన్ సరిహద్దులోని పాకిస్థాన్‌ ఆస్పత్రులన్నీ తాలిబన్లతో నిండిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.