News

శ్రీనగర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులు హతం

720views

మ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్​ దాన్మార్లోని అలందార్​ కాలనీలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

ముష్కురులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా సిబ్బంది.. ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ప్రాంతంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.