
రైల్వే స్టేషన్‌లలో మహిళలు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భారత్‌లోని 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ లను రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం 2016లో దేశవ్యాప్తంగా 983 రైల్వేస్టేషన్లు ఎంపిక చేయగా, ప్రస్తుతం 813 స్టేషన్లలో కెమెరాల ఏర్పాటు పూర్తయింది. మిగిలిన రైల్వేస్టేషన్లలో కెమెరాల ఏర్పాటు తుదిదశలో ఉందని, ‘నిర్భయ’ నిధుల నుంచి ఈ పథకం అమలుచేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెల నాటికి మరో 756 రైల్వే స్టేషన్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గత ఏడాది జూన్ 25వ తేదీన రైల్వే స్టేషన్‌లలో సీసీటీవీలను ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల రైల్‌టెల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 456 రైల్వే స్టేషన్‌లలో పూర్తి చేయడానికి ఈ ఏడాది మే నెలలో నాలుగు టెండర్లను వేసింది. రైల్వే ప్రాంగణంలో మెరుగైన భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, వీడియో ఫీడ్లను పర్యవేక్షిస్తున్నారు రైల్వే అధికారులు.





