
441views
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం బోర్డులో ఉన్న చైనీయులు అందరూ బయటకు వచ్చేశారు. అలీపే ప్రతినిధి జింగ్ షియాంగ్‌డాంగ్, యాంట్ ఫైనాన్షియల్‌కు చెందిన గూమింగ్ ఛెంగ్, అలీబాబా ప్రతినిధులు మైఖేల్ యెన్ జెన్ యా, టింగ్ హాంగ్ కెన్నీ హోలు సంస్థ డైరెక్టర్ల పదవుల్లో నుంచి తప్పుకోనున్నారు. ఇక వారి స్థానంలోకి భారతీయులు, అమెరికన్లు వచ్చి చేరారు. పేటీఎం పబ్లిక్ ఇష్యూకు రాబోతున్న నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న షేర్ హోల్డింగ్‌ల్లో ఎలాంటి మార్పులు లేవని నియంత్రణ సంస్థలకు కంపెనీ సమాచారం అందించింది.





