News

అహంభావ ట్విట్టర్ ను నిషేదించిన నైజీరియా..

1.1kviews

దేశాధ్యక్షుడు పోస్ట్ చేసిన ట్వీట్‌ను తొలగించడంతో పాటు ఆ ఖాతాను 12 గం‌టల పాటు సస్పెండ్ చేయడంతో ఆ దేశంలో ట్విట్టర్ బ్యాన్‌కు గురైయ్యింది. దేశంలో ట్విట్టర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలుపుదల చేస్తూ ఆఫ్రికా దేశమైన నైజీరియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు నైజీరియా సమాచార, సాంస్కృతిక మంత్రి అల్‌హాజి లాయ్ మొహ్మద్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. దేశంలో కార్పొరేట్ ఉనికిని అణచివేసే కార్యకలాపాల కోసం ట్విట్టర్‌ను వినియోగిస్తున్నందున ఫెడరల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ట్విట్టర్‌ను బ్యాన్ చేస్తూ నైజీరియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం  వెనుక ఇతర కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారి రెండ్రోజుల క్రితం చేసిన ఓ పోస్ట్‌ను అభ్యంతరకరమైన పోస్ట్‌గా పరిగణిస్తూ దాన్ని ట్విట్టర్ డిలీట్ చేసింది. దీంతో పాటు ఆయన ట్విట్టర్ ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేసింది. దీనికి ప్రతీకారంగానే దేశంలో ట్విట్టర్ కార్యకలాపాలను నిలుపుదల చేస్తూ నైజీరియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.