News

ఐరాస కార్యదర్శితో జయశంకర్ బేటీ

811views

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గా ప్రాంతీయ సవాళ్ళు, ఉగ్రవాదం తదితర అంశాలపై సమగ్ర చర్చ జరిగిందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు ‌ మంగళవారం ప్రత్యక్షంగా జరిగిన సమావేశంలో భారత్కు పొరుగు దేశాలతో సవాళ్లు, ఉగ్రవాదం, మయన్మార్ సహా ఆగస్టులో ఐరాస భద్రతా మండలికి అధ్యక్షత వహించే సమయంలో దేశ ప్రాధాన్యతలు, వాతావరణ మార్పు చర్చించినట్లు ట్విట్టర్లో జై శంకర్ వెల్లడించారు.

వాతావరణ మార్పులపైనా ఈ భేటీలో చర్చించినట్లు ట్విట్టర్ వేదికగా జైశంకర్ వెల్లడించారు. సముద్ర యాన భద్రత, శాంతి స్థాపనకు సాంకేతికత వినియోగం ప్రస్తుత అవసరాలని చెప్పారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.