ఆమె అధికారులను హింసాత్మక సంఘటనల సమాచారాన్ని నాకు అందించవద్దని ఆదేశించారు : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై గవర్నర్ జగదీష్ ధనకర్ తీవ్ర వ్యాఖ్యలు.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం బెంగాల్ లో హిందువులపైన, బిజెపి కార్యకర్తలపైన, ఓటర్లపైన జరుగుతున్న హింసకు సంబంధించిన సమాచారాన్ని, వివరాలను తనకు అందించ వద్దని సీఎం మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారని పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధనకర్ ఆరోపించారు.
దానికి ముందు ఆయన ఆ రాష్ట్ర డిజిపికి ఎన్నికల అనంతర హింసపై తనకు సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతూ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. హిందుస్థాన్ టైమ్స్ పత్రికతో మాట్లాడుతూ గవర్నర్…. సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని తనకు అందించ వద్దని ఆదేశించారని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి తనకు తెలిపారని చెప్పారు.
రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అధికార వర్గాల గురించి మాట్లాడుతూ ఆయన… రాష్ట్రంలోని అధికారగణం మొత్తం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గణం వలే పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. హింసను అదుపుచేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Source : Organiser





