News

పశ్చిమబెంగాల్‌ హింసపై గవర్నర్‌ నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

679views

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ను నివేదిక కోరింది. హింసపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరినప్పటికీ ఎలాంటి స్పందనా లేకపోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్‌కు సూచించింది. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలంది. ఇప్పటికే కేంద్రహోంశాఖ హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఎన్నికల అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన గూండాలు తమ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలను హతమార్చారంటూ భాజపా ఆరోపించింది. దీన్ని మమత ప్రభుత్వం తోసిపుచ్చింది. మరోవైపు కేంద్రమంత్రి మురళీధరన్‌ కారుపై రాళ్లు, కర్రలతో గురువారం దాడి జరిగింది. తృణమూల్‌ కార్యకర్తలే దీనికి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.