355
జమ్ముకశ్మీర్‌లో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా కనిగాం ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య కాల్పులు జరిగాయి. ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో వారిని చుట్టుముట్టిన జవాన్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. తౌనిఫ్ అహ్మద్ అనే ఉగ్రవాది లొంగిపోయాడు. ఈ నలుగురిని అల్ బదర్ ఉగ్రసంస్థలో కొత్తగా చేరిన తీవ్రవాదులుగా భద్రతాబలగాలు గుర్తించాయి.