News

రూ.899లకే రెమిడిసివిర్

709views

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 రెండోదశ తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలు కూడా పెరిగిపోయాయి. మరోవైపు బ్లాక్‌ మార్కెట్‌ పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కొవిడ్‌-19 వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ సిఫారసు చేస్తున్నారు. ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ కొరత ఏర్పడగా, బయట మార్కెట్‌లో దీన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలను తగ్గించాలని ప్రభుత్వం, నేషనల్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ(ఎన్‌ఏపీపీఏ) ఫార్మా కంపెనీలను కోరగా, అందుకు ఆయా కంపెనీలు అంగీకరించాయి.

క్యాడిల్లా హెల్త్‌కేర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, సిప్లా బ్రాండ్‌లు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌(100mg/vial) ధరను తగ్గించాయి. ‘ప్రభుత్వ జోక్యంతో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ ధరను ఫార్మా కంపెనీలు తగ్గించాయి. కరోనాపై పోరాటంలో ప్రభుత్వంతో చేతులు కలిపి తమవంతు సాయం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు” అని కేంద్ర మంత్రి ముఖేశ్‌ ఎల్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.