NewsSeva

నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కి దొడ్ల రుక్మిణమ్మ, వరదా రెడ్డి ట్రస్ట్, చెన్నై వారు 50 లక్షలు విరాళం.

881views

సింహపురి వైద్య సేవా సమితి (జయ భారత్ హాస్పిటల్) నిర్వహిస్తున్న Dr మల్లెల రామయ్య కాలేజ్ అఫ్ నర్సింగ్ హాస్టల్ భవనం కొరకు చెన్నై కు చెందిన దొడ్ల రుక్మిణమ్మ వరదా రెడ్డి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ దొడ్ల రఘునాథ్ రెడ్డి 50లక్షల రూపాయిల చెక్ ను సింహపురి వైద్య సేవా సమితి అధ్యక్షులు శ్రీ పొన్నలూరు సీతారామి రెడ్డి గారికి అందచేయగా, వారు సింహపురి వైద్య సేవా సమితి ఉపాధ్యక్షులు శ్రీ బాలుసుబ్బరావు గారికి ఆ చెక్ ను నేడు అందజేశారు. గతంలో కూడా ఈ ట్రస్ట్ వారు హాస్పిటల్ నిర్మాణానికి మరియు వైద్య పరికరాలు కొరకు కోటి రూపాయలు పైన సహాయం చేశారని ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. సింహపురి వైద్య సేవా సమితి తరపున ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డాక్టర్ GV కృష్ణా రెడ్డి, శ్రీ గుఱ్ఱం సుధాకర్, JBH మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివమౌర్య గుప్తా, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి లు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.