
కేరళ పాలక్కాడ్ జిల్లా శ్రీ క్రిష్ణ పురం సమీపంలోగల కటంపాజిపురం సమీపంలో జరుగుతున్న “నీయం నాది” అనే మళయాళ సినిమా షూటింగ్ ను స్థానిక హిందువులు అడ్డుకున్న సంఘటన కేరళలో చోటుచేసుకుంది.
అందిన సమాచారం మేరకు కటంపాజిపురం వాయిలంకున్ను దేవాలయం వద్దకు చేరుకున్న చిత్రనిర్మాణ బృందం అక్కడ సినిమా షూటింగ్ జరపడం ప్రారంభించింది. అక్కడ చిత్రీకరిస్తున్న సన్నిశంలో సాంప్రదాయక హిందూ యువతి వేషంలో ఉన్న ఒక యువతి ఒక ముస్లిం యువకుడి ఆకర్షణలో పడినట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఆ చిత్ర దర్శక బృందంలో ఆషిక్, షిను, సల్మాన్ అనే వారున్నారు. దీంతో దేవాలయం బయట గుమి కూడిన కొంతమంది హిందువులు దీనిపై నిరసనలు వ్యక్తం చేయడం ప్రారంభించారు.
అలాగే దేవాలయం బయట ముస్లిం మతానికి చెందిన పచ్చ జెండా లు, కమ్యూనిజానికి చెందిన ఎర్రజెండాలు ఉన్నట్టుగా చూపిస్తుండడాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.
A film shooting in temple was stoped by Hindus in Kerala and media labelled them as Sanghis.
Reality was it was a film glorifying love jehad and they used a pakistan kind of flag and actors wearing muslim ethnic wears inside temple. Cant encourage this. Will stop in future also. pic.twitter.com/zuzK04RFBa— Pratheesh Viswanath (@pratheesh_Hind) April 11, 2021
లవ్ జిహాద్ కి అనుకూలంగా ఉన్నట్లుగా ఉన్న సినిమా కథా కథనాన్ని, సినిమా చిత్రీకరణ కోసం వాయిలంకున్ను దేవాలయాన్ని ఎంచుకోవడాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య సినీ బృందం మరొక లొకేషన్ కు తరలి వెళ్లింది.
ఘటనపై కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు నిరసన తెలిపిన శ్రీజిత్, సచ్చితానందన్, సుబ్రహ్మణియన్, బాబు, శబరీష్ అనే ఐదుగురిని అరెస్టు చేయడం గమనార్షం.
“దేవాలయంలోంచి ఒక యువతి బయటకు వస్తుండగా, రోడ్డుమీద వెళుతున్న ఒక ముస్లిం యువకుడ్ని చూసి ఆమె ఆకర్షితురాలైనట్టుగా చూపించే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో స్థానికులు షూటింగ్ ను అడ్డుకున్నారని ఆ చిత్ర బృందం లో ఒకడు, రచయిత కూడా అయిన సల్మాన్ ఫారిస్ తెలియజేశాడు.
ఈ మొత్తం గొడవలో ఓ 13 ఏళ్ల బాలిక గాయపడిందని, యూనిట్ లోని కుర్చీలు, కెమెరా స్టాండ్ ధ్వంసం అయ్యాయని సల్మాన్ ఆరోపిస్తున్నాడు. చిత్ర నిర్మాణంలో భాగంగానే ఇస్లామిక్, కమ్యూనిస్టు జెండాలను అక్కడికి తెచ్చామని, తాము దేవాలయం బయట మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్నామని, దీనిని కేవలం కళలో భాగంగా మాత్రమే చూడాలని వాదిస్తున్నాడు.
Kerala, Palakkad, Kadambajhipuram:
An attempt to desecrate the Vayilamkunnu temple complex, the film was being shot between Hindu girl and Muslim boy promoting love jihad.
Film director Aashiq Shinu Salman
Hindu organization and BJP workers stop shooting pic.twitter.com/SZnUaRtfqE
— Kalu Singh Chouhan (@kschouhan94) April 10, 2021
అంతటితో ఆగకుండా గతంలో తను షూటింగ్ చేసుకున్న లొకేషన్ తో పోలిస్తే తనకు ఈ లొకేషన్ చాలా చౌకగా లభించిందని, తాను గతంలో రోజుకి 35 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటే ప్రస్తుతం కేవలం మూడు వేల రూపాయలకు తనకు ఇక్కడ అనుమతి లభించిందని, ఆ మొత్తాన్ని దేవాలయ నిర్వాహకులకు తాము చెల్లించి అనుమతులు పొందామని సల్మాన్ వాదిస్తున్నాడు.
పాలక్కాడ్ జిల్లా బిజెపి అధ్యక్షులు E. కృష్ణదాస్ మాట్లాడుతూ దేవాలయ నిర్వాహకులు, దేవాదాయ శాఖ ఎవరూ అక్కడ షూటింగ్ జరుపుకోవడానికి అనుమతించలేదని తెలిపారు. వాయిలంకున్ను దేవస్థానం ఈవో డెక్కన్ హెరాల్డ్ తో మాట్లాడుతూ ఆ దేవస్థానం పరిసరాలలో షూటింగ్ చేసుకోవడానికి తాము ఎవరికీ ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తగిన అనుమతులు లేకుండానే దేవాలయ ప్రాంగణంలో షూటింగ్ చేపట్టడానికి వచ్చిన చిత్ర బృందంపై కేసు నమోదు చేయాలని దేవాలయ అధికారులు భావిస్తున్నారు.
“మొత్తానికి చిత్రం యొక్క కథా కథనం కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉంది. సినిమాలో మిగిలిన పాత్రధారులు ఎక్కువమంది సాంప్రదాయ ముస్లింల వేషంలో ఉన్నారు. కనుక భవిష్యత్తులో సైతం ఈ సినిమా చిత్రీకరణను సాగనివ్వం. “నీయం నాది” సినిమాను ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాం” అని బీజేపీ నేత శ్రీ కృష్ణ దాస్ స్పష్టం చేశారు.
Source : OPINDIA





