News

మావోయిస్టు కమాండర్ హతం

635views

టీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ మరువక ముందే ఆదివారం తుపాకుల మోతతో అక్కడి అడవులు మరోసారి దద్దరిల్లాయి. దంతెవాడ జిల్లాలో జవాన్లకు మవోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు మిలీషియా కమాండర్‌ వెట్టి హుంగా మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇంకొందరు మావోయిస్టులు కూడా ఈ ఘటనలో మరణించి ఉంటారని భావిస్తున్నారు. హుంగాపై రూ.లక్ష రివార్డు ఉంది. కాల్పులు జరిగిన ప్రాంతంలో 8ఎం.ఎం. పిస్టల్‌, నాటు తుపాకీ, 2కిలోల ఐఈడీ, టపాసులు, మావోయిస్టు సాహిత్యం, కొన్ని మందులను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.