
కర్ణాటకలోని మైసూర్ లోని ఒక గ్రంధాలయంలో 3000 భగవద్గీత పుస్తకాలను కొందరు దుండగులు తగలబెట్టారు. ఈ పబ్లిక్ గ్రంధాలయం సయీద్ ఇసాక్ అనే వ్యక్తికి చెందినది.

ఆ లైబ్రరీలో సుమారు 11000 పుస్తకాలు ఉన్నాయి. సయ్యద్ ఇసాక్ అనేక సంవత్సరాలుగా అక్కడ గ్రంథాలయాన్ని నిర్వహిస్తూ ఆ చుట్టు పక్కల ప్రజలందరికీ సుపరిచితుడు. వేలాది పుస్తకాలను అక్కడి వారికి ఆయన ఇస్తూ ఉంటాడు. “వేకువజామున నాలుగు గంటలకి గ్రంథాలయం పక్కనే నివశిస్తూ ఉండే వ్యక్తి ఒకరు గ్రంథాలయంలో నుంచి మంటలు వస్తున్నట్టుగా నాకు సమాచారం అందించాడు” అని ఇసాక్ మీడియాకు తెలియజేశాడు.
In a tragic incident, miscreants have set ablaze a public library run by Syed Issaq, a daily wage labourer that had a collection of 11k books including 3k copies of Bhagavad Gita, in #Mysuru. His years of efforts was turned into ashes overnight !@XpressBengaluru @santwana99 pic.twitter.com/KTEBJkHB39
— Karthik Nayaka (@Karthiknayaka) April 10, 2021
“మా గ్రంథాలయంలో మూడు వేలకు పైగా భగవద్గీత గ్రంధాలు ఉన్నాయి. వెయ్యికి పైగా ఖురాన్, బైబిల్ కాఫీలు కూడా ఉన్నాయి. నేను వాటన్నిటినీ అనేకమంది దాతల నుంచి సేకరించాను” అని ఇసాక్ చెప్పుకొచ్చాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని వారు ఐపీసీ సెక్షన్ 436 కింద కేసు రిజిస్టర్ చేసుకున్నారని ఇసాక్ తెలిపాడు.
“నేను సరైన విద్యకు నోచుకోలేదు. కానీ పది మందికీ విద్యను అందించాలని, వారు చక్కగా చదవడం, వ్రాయడం నేర్చుకోవాలనే కోరికతో నేను ఈ గ్రంథాలయాన్ని నెలకొల్పాను” అని ఇసాక్ తెలిపాడు. ఇసాక్ ఒక దినసరి కూలీ.





