News

మొఘలులను కీర్తిస్తూ చరిత్ర పాఠాలా? : NCERT కి, విద్యాశాఖ మంత్రికి కోర్టు నోటీసులు

928views

న్నెండవ తరగతి చరిత్ర పాఠాలలో మొఘలులను అతిగా కీర్తిస్తూ ఉండడంపై NCERT డైరెక్టర్ మరియు రాజస్టాన్ రాష్ట్ర  విద్యా మంత్రిత్వ శాఖలకు జైపూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

అభూత కల్పనలతో కూడిన చరిత్ర పుస్తకాలలో నుంచి వాటిని తొలగించి సరి అయిన చరిత్రను విద్యార్థులకు అందించవలసిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ కు స్పందించిన కోర్టు ఏప్రిల్ 19న ప్రతివాదులు తాము నేరుగా కోర్టుకు హాజరవటం కానీ, తమ న్యాయవాదుల ద్వారా తగు పత్రాలతో సమాధానం ఇవ్వడం గానీ చేయవచ్చని సూచించింది.

12వ తరగతి చరిత్ర పుస్తకంలో 234 వ పేజీలోని “థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ – 2” అనే పాఠ్యాంశంలో షాజహాన్ మరియు ఔరంగజేబులు యుద్ధాలలో ధ్వంసమైన హిందూ దేవాలయాల పునరుద్ధరణకు నిధులను మంజూరు చేసినట్లుగా ఉన్నది. అయితే నిజానికి ఏ చరిత్ర గ్రంధాలలోనూ ఇందుకు తగిన సాక్ష్యాలు లేవని, అదంతా పూర్తిగా కట్టుకథ అని పేర్కొంటూ ఆ భాగాలను చరిత్ర పాఠాల నుంచి తొలగించవలసిందిగా కోరుతూ PC భండారి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. విద్యా మంత్రిత్వ శాఖ అదనపు సెక్రెటరీని, NCERT డైరెక్టర్ ని ఇందులో ప్రతివాదులుగా చేర్చాడు. కోర్టు తన నోటీసును స్వీకరించి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ తప్పుడు పాఠాలను పాఠ్య పుస్తకాల నుంచి తొలగించలేదని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.