
680views
శ్రీశైల మహాక్షేత్రంలో పురాతన శాసనాలు బయటపడ్డాయి. రుద్రాక్ష మఠానికి ఉత్తరం వైపు ఉన్న పరుపుబండపై పురాతన చిత్ర లిపి శాసనాలను గుర్తించారు. క్షేత్ర పరిధిలో ప్రాచీన శాసనాలు ఉన్నాయన్న సమాచారం మేరకు బుధవారం దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, తెలుగు విశ్వ విద్యాలయ పీఠం ఆచార్యులు చంద్రశేఖర్ రెడ్డి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో ఆలయ చరిత్రకు అద్దం పట్టే విధంగా ఉన్న చిత్ర లిపి శాసనాలను గుర్తించారు. ప్రాచీన శాసనాలను సాంకేతిక నిపుణులతో అధ్యయనం చేయించడానికి దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు ఈవో తెలిపారు. పురాతన శాసనాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నామని చెప్పారు.





