
ప్రముఖ గీతా ప్రెస్ అధినేత, కళ్యాణ్ పత్రిక సంపాదకుడు రాధేశ్యాం ఖేమ్కా శనివారం వారణాసిలో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరిగాయి.
ఖేమ్కాజీ గత 38 సంవత్సరాలుగా గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ ట్రస్ట్ నిర్వహణలోని కల్యాణ్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఆయన 1982 నవంబర్ / డిసెంబర్ లో పత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 1983 మార్చి నుండి, ఆయన ఆ పత్రికకు నిరవధికంగా ఎడిటర్ కొనసాగుతున్నారు.
గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయన తుది శ్వాస తీసుకోవడానికి ముందు, ఏప్రిల్ నెల సంచికకు కూడా ఆయనే ఎడిటర్ గా వ్యవహరించారు.
ఈ పత్రిక 1926 నుండి ప్రచురింపబడుతోంది. ఇది గోరఖ్‌పూర్ లోని గీతా ప్రెస్ నుంచి వెలువడుతున్న ఆధ్యాత్మిక మాస పత్రిక.
గోరఖ్‌పూర్ లో గీతా ప్రెస్ ను 1923 లో హనుమాన్ ప్రసాద్ పోద్దర్ జీ స్థాపించారు. సనాతన మత గ్రంథాల ప్రచురణ ద్వారా మానవత్వాన్ని పెంపొందించేందుకు గీతాప్రెస్ అవిశ్రాంత కృషి సలుపుతోంది.
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యాం ఖేమ్కా మరణానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సంతాపం తెలిపారు. “ఆయన తన జీవితాంతం సామాజిక సేవలో చురుకుగా పాల్గొన్నారు. ఖేమ్కా సనాతన సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు.” అని ప్రధాని పేర్కొన్నారు.
गीता प्रेस के अध्यक्ष और सनातन साहित्य को जन-जन तक पहुंचाने वाले राधेश्याम खेमका जी के निधन से अत्यंत दुख हुआ है। खेमका जी जीवनपर्यंत विभिन्न सामाजिक कार्यों में सक्रिय रहे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) April 4, 2021
Source : Organiser.





