News

కాశ్మీర్ : బురఖాతో వచ్చి పోలీసును చంపిన ఉగ్రవాదులు

790views

లోయలో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు ఉగ్రవాదులు ఒక పోలీసును చంపారు. రమీజ్ రాజా అనే పోలీసును భారతీయ జనతా పార్టీ నాయకుడు మహ్మద్ అన్వర్ ఖాన్ ఇంట్లో రక్షణ కోసం నియమించారు. ఆ అన్వర్ ఖాన్ ఇంట్లో డ్యూటీలో ఉన్న సమయంలోనే ఉగ్రవాదులు రమీజ్ ను చంపారు. దాడి జరిగినప్పుడు ఖాన్ ఇంట్లో లేరు.

కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ “నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు రమీజ్ రాజాను చంపారు. వారిలో ఇద్దరిని స్థానికులుగా గుర్తించాం.” అని తెలిపారు.

మొదట బురఖాలో ఒక ఉగ్రవాది బిజెపి నాయకుడు ఖాన్ ఇంటి తలుపు తట్టాడు. రమీజ్ రాజా, ఎవరో మహిళ ఖాన్ ఇంటికి వచ్చిందనుకుని, తలుపు తెరిచారు. తలుపు తెరిచిన వెంటనే, మరో ముగ్గురు ఉగ్రవాదులు రజాపై దాడి చేశారు. అతనిపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో అతను తరువాత ఆసుపత్రిలో మరణించాడు. అతని రైఫిల్‌తో ఉగ్రవాదులు పారిపోయారు.

ఇది ఈ వారంలో లోయలో జరిగిన మూడవ ఉగ్రవాద దాడి. శ్రీనగర్‌లో గత వారం సీఆర్‌పిఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముగ్గురు సిఆర్‌పిఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. గత వారం సోపోర్‌లో జరిగిన మరో ఉగ్రవాద దాడిలో ఇద్దరు మునిసిపల్ కౌన్సిలర్లు, ఒక పోలీసు అమరులయ్యారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.