ఇస్లామిస్ట్ ఉగ్రదాడుల ముప్పు తరువాత, ఈస్టర్ వేడుకల కోసం ఇండోనేషియాలోని చర్చిల చుట్టూ భద్రత కట్టుదిట్టం చేయబడింది.
మార్చి 28 న దక్షిణ సులవేసిలోని ఒక చర్చిపై ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారు. ఆ ఘటనలో 20 మందికి పైగా చర్చి సభ్యులు గాయపడ్డారు.
మార్చి 31 న బురఖాలో వచ్చిన ఓ 25 ఏళ్ల ఐసిస్ సానుభూతిపరురాలు ఒక పోలీసు స్టేషన్ పై దాడి చేసింది. ఆమె పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించింది. మరిన్ని ఉగ్రవాద దాడులకు అవకాశమున్నదన్న హెచ్చరికలతో దేశవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు.
ఇండోనేషియాలో సుమారు 10 శాతం క్రైస్తవ జనాభా ఉంది. క్రైస్తవులు మరియు ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని తరచుగా జరిగే ఇలాంటి ఇస్లామిస్ట్ దాడులను ఎన్నింటినో దేశం చూసింది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశంలో, అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యురాలు తులసి గబ్బార్డ్ ఇస్లాంవాదుల నుండి ప్రపంచవ్యాప్తంగా ఇతర మతస్థులకు పొంచివున్న ప్రమాదాన్ని గురించి లేవనెత్తారు.
ఇరాక్, సిరియా వంటి దేశాలలో ఒకప్పుడు క్రైస్తవుల జనాభా గణనీయంగానే ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇస్లాంవాదుల వేదిపులతో వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
Source : Organiser.