
భారత ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌లో పర్యటించడంపై ఆ దేశంలో శని, ఆదివారాలు అల్లర్లు చెలరేగాయి. హిఫాజత్ ఎ ఇస్లాం అనే ఇస్లామిస్ట్ గ్రూప్ పిలుపు మేరకు ఆదివారం ఎద్దఎత్తున పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు వీధుల్లో నిరసన చేపట్టారు. హిందూ దేవాలయాలపై దాడికి దిగారు. బ్రహ్మన్‌బరియాలో ఓ రైలుకు, రెండు బస్సులకు నిప్పంటించారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పలు ప్రభుత్వ భవనాలు, ఓ ప్రెస్‌క్లబ్‌కు సైతం నిప్పంటించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు అందోళనకారులపై భాష్పవాయువు, రబ్బరు బులెట్లును ప్రయోగించారు.
భారత్‌లో ముస్లింలపై వివక్ష చూపుతున్నారని ఇస్లామిస్ట్ గ్రూప్ హిఫాజత్ ఎ ఇస్లాం ఆరోపించింది. దీంతో ఆందోళనకారులు శుక్రవారం నుంచి పలుచోట్ల దాడులకు దిగారు. శుక్రవారం నుంచి ఇప్పటివరకు 10 మంది ఆందోళనకారులు మృతి చెందారు. బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి భారత ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ 10.2 లక్షల డోసుల కరోనా టీకాలు బహుకరించారు. కానీ అక్కడి ప్రజలు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నివహించడం, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉండటంపై భారత్ లోని హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.





