
653views
రక్షణ, సైనిక వ్యవహారాల్లో భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా తూర్పు హిందూ మహాసముద్రంలో భారత్-అమెరికా దేశాల నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం ప్రారంభమైన ఈ విన్యాసాలు రెండు రోజులపాటు జరుగనున్నాయి. భారత్‌కు చెందిన యుద్ధ నౌకలు శివాలిక్, లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ పీ8ఐ విన్యాసాల్లో పాల్గొన్నాయి. అమెరికా తరఫున యూఎస్‌ఎస్ థియేడర్ రోజ్‌వెల్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ పాల్గొంది. ‘పాసెక్స్’ పేరిట నిర్వహిస్తున్న ఈ నౌకాదళ విన్యాసాల్లో తొలిసారిగా భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్లు సైతం భాగస్వామ్యులైనట్లు నేవీ అధికారులు వెల్లడించారు.





