News

ఢిల్లీలోని రోహింగ్యాల నుండి తన భూమిని తిరిగి తీసుకోనున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

1.1kviews

ఢిల్లీలోని కలిండి కుంజ్ ప్రాంతంలోని రోహింగ్యాల నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోనుంది.

అధికారుల ఆమోదం పొందిన తరువాత, నీటిపారుదల శాఖ ఢిల్లీ పోలీసుల సహాయం కోసం వేచి ఉంది. అది ఈ వారంలో లభిస్తుందని భావిస్తున్నారు.

రోహింగ్యాలు జకాత్ ఫౌండేషన్ స్థలంలో నివాసమేర్పరచుకుని ఉన్నారు. 2018 ఏప్రిల్‌లో ‌అక్కడ భారీ అగ్నిప్రమాదం జరిగింది.

అప్పట్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు ఆ భూమిలో ఉండటానికి అనుమతించింది. కానీ అది త్వరలోనే ఖాళీ అవనుంది.

మూడేళ్ళ క్రిందటి నుండి స్థానిక ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సహకారంతో రోహింగ్యాలు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభమైంది.

అక్కడ మట్టితో నిర్మించిన గృహాల సంఖ్య కూడా 36 నుండి 50 కి పెరిగింది. అక్కడి స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ “భూమిని ఖాళీ చేయమని కోరము” అని వారికి హామీ ఇచ్చారు. కానీ రోహింగ్యాల గురించి స్థానిక నివాసితుల నుండి పలు ఫిర్యాదులు వస్తున్నాయి.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.