
822views
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలు రూ.3 వేల కోట్ల రూపాయలు దాటాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.ఆలయ నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించడం నిలిపివేశామని, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా భక్తులు విరాళాలు పంపవచ్చని ఆయన స్పష్టం చేశారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. నిధులు సేకరిస్తూనే ఆలయ ప్రాముఖ్యత, అయోధ్య ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిధుల సేకరణకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అనేక మంది దాతలు యథాశక్తి విరాళాలు సమర్పించారు.





