News

17 ఏళ్ల దళిత మైనర్ బాలికపై ముస్లిం యువకుడి అత్యాచారం – ఆపై మతమార్పిడికి ఒత్తిడి – ఉత్తర ప్రదేశ్ లో ఘటన

580views

17 ఏళ్ల దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను మతం మార్చేందుకు ప్రయత్నించిన రాజు అన్సారి అనే ముస్లిం యువకుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు, బాధితురాలు ఇద్దరూ ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన వారే. భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల తోపాటు ఉత్తరప్రదేశ్లోని అక్రమ మత మార్పిడి నిరోధ చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు గా పోలీసులు తెలిపారు. గత శుక్రవారం రాత్రి నిందితుడు తన ఇంట్లోనే బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం బాధితురాలిని నిందితుడి నిర్బంధం నుంచి రక్షించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.