
565views
దేశ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో గత ఆదివారం వీర మరణం పొందిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం అందజేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఎమ్‌ఎస్ బాబు, శ్రీనివాసులుతో కలిసి రూ.50లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. వీరమరణం పొందిన సైనికుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి భరోసా కల్పించారు. అదేవిధంగా ఆ అమరవీరుని కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను పూర్తిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.





