
తిరుమల తిరుపతి దేవస్థానం ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా కొన్ని ఎంపిక చేసిన దేవాలయాలకు గోమాతలను అందజేస్తామని, అనంతరం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని దేవస్థానం బోర్డు సభ్యులు, యుగ తులసి సంస్థ చైర్మన్ శ్రీ శివ కుమార్ తెలిపారు.
గోవులను సంరక్షించడం అందరి బాధ్యత అని, ఆయన పేర్కొన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“ఈ దేహం, ఈ ప్రాణం గోమాత కోసం అనే నినాదంతో ముందుకు సాగుతాం. అంతేకాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మా ఫౌండేషన్ తరపున గో సేన అనే విభాగం పనిచేస్తోంది. ప్రతి నియోజకవర్గం లోనూ ఒక గోశాలను ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజులలో తెలంగాణలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోశాలను ఏర్పాటు చేస్తాం” అని శ్రీ శివకుమార్ వివరించారు.





