
549views
గుంటూరు జిల్లా ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విజ్ఞప్తి మేరకు ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీ గల్లా జయదేవ్‌కు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ దిల్లీలో ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి గల్లా జయదేవ్ ధన్యవాదాలు తెలిపారు.





