News

ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోలు హతం

513views

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ వాసి చుక్కాలుగా గుర్తించారు. మరో మావోయిస్టు వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో 9ఎంఎం పిస్తోలుతో పాటు, మరో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో మావోయిస్టు వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతాన్ని ఆదివారం ఉదయం జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ సత్యనారాయణ, మంచిర్యాల ఓఎస్టీ ఉదయ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పోలీసు బృందం పరిశీలించింది.

కడంబా గ్రామానికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో రహదారిపక్కనే ఎదురు కాల్పులు జరిగాయని, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల డివిజన్‌ కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు ఆలియాస్‌ భాస్కర్‌ మరోసారి తప్పించుకున్నట్టు ఇన్‌ఛార్జి ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. అతని కోసం ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.