News

ప్లాస్మా దానం చేసిన ఆరెస్సెస్ నేత

630views

రెస్సెస్ ఆంద్ర ప్రాంత ప్రచార ప్రముఖ్, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత శ్రీ బయ్యా వాసు, వారి కుమార్తె శ్రీమతి పద్మ నివేదిత కరోనాతో పోరాడుతున్న వారికి ప్లాస్మా థెరపీకి ఉపయోగపడేందుకు ప్లాస్మా దానం చేశారు. ఇటీవల వీరిరువురు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. తమ ద్వారా మరికొందరు కోవిడ్ నుంచి కోలుకుని ప్రాణాలు దక్కించుకోవాలనే ఆకాంక్షతో వారు ప్లాస్మా దానానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్లాస్మా థెరపీ చికిత్సకు అవసరమైన ప్లాస్మాను ఏర్పాటు చేయడంలో నెల్లూరు రెడ్ క్రాస్ ముందు ఉందని తెలిపారు. ప్లాస్మా దానం చేసిన తండ్రి కూతుళ్ళను ఆయన అభినందించారు. ప్లాస్మా దాతలని రెడ్ క్రాస్ సభ్యులు కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి , వైస్ చైర్మన్ శ్రీ డి సుధీర్ నాయుడు, కోశాధికారి శ్రీ సురేష్ జైన్, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు శ్రీ బయ్యా ప్రసాద్, శ్రీ యడవల్లి సురేష్, కన్వీనర్ అజయ్ బాబు డాక్టర్ యశోవర్ధన్ మరియు ప్లాస్మా దాతలు పాల్గొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.