News

35 జాతీయ నేత్ర దానోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం

448views

ప్రతి సంవత్సరం భారతదేశంలో 80 లక్షలకు పైగా ప్రజలు మరణిస్తున్నారు, అయితే 30 వేల మంది మాత్రమే నేత్రదానం చేస్తున్నారు. అంటే 1% కన్నా తక్కువ. వచ్చే 5 సంవత్సరాలలో భారత్ కార్నియా అంధత్వం లేకుండా ఉండటానికి ప్రతి సంవత్సరం కనీసం 2 లక్షల జతల కార్నియా దానం చేయాలి.

 ‘కాంబా’ అనేది సక్షం ప్రారంభించిన ఒక జాతీయ ఉద్యమం. ఈ ఉద్యమంలో నేత్ర వైద్య నిపుణుల తోపాటు ఇతర వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, మెడికల్ గ్రాడ్యుయేట్లు, ఐ హాస్పిటల్స్,  కంటివైద్యంతో సంబంధం ఉన్న వాలంటీర్లు మరియు ప్రజలు ఈ ముఖ్యమైన సందర్భంలో చేరాలని మరియు పల్స్ పోలియో వలె ‘కాంబా’ ను కూడా బలమైన ఉద్యమంగా మార్చాలని ‘సక్షం’ విజ్ఞప్తి చేస్తోంది.

ఈ రోజు 8/9/2020 మంగళవారం 35 జాతీయ నేత్ర దానోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమంలో మనతో పాలుపంచుకోవడానికి భారతదేశం యొక్క గౌరవనీయ ఉపాధ్యక్షుడు, శ్రీ వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కనుల పండువైన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం…..

https://youtu.be/WXSFZ1AEIYM

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.